సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరో సిద్ధార్థ్ ట్వీట్..!

Published on Oct 3, 2021 2:00 am IST


హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నప్పుడు స్కూలులో మా టీచర్ నాకు ఓ తొలి పాఠం నేర్పించిందని, మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరని, మీకూ ఇలాంటి వారు ఉన్నారా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే కెరిర్ తొలి రోజుల్లో సిద్ధార్థ్‌తో కలిసి శ్రీకాళహస్తిలో సమంత రాహు కేతు పూజలు చేశారు.

అయితే సిద్ధార్థ్ సమంతను ఉద్దేశించే ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య-సమంత విషయంలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలే నిజమయ్యాయి. చైతూ-సమంత విడిపోతున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించారు.

సంబంధిత సమాచారం :