ఈ పాత్ర చాలా కష్టం గా అనిపించింది…డాక్టర్ చిత్రం పై శివ కార్తికేయన్ కీలక వ్యాఖ్యలు!

ఈ పాత్ర చాలా కష్టం గా అనిపించింది…డాక్టర్ చిత్రం పై శివ కార్తికేయన్ కీలక వ్యాఖ్యలు!

Published on Oct 6, 2021 8:57 PM IST


శివ కార్తికేయన్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం వరుణ్ డాక్టర్. శివ కార్తికేయన్ ప్రొడకన్స్ మరియు KJR స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని శివ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 9 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు హీరో శివ కార్తికేయన్ మీడియా తో మాట్లాడుతూ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

డాక్టర్ మూవీ ఎలా ఉండబోతుంది?

డాక్టర్‌ గురించి పూర్తిగా తెలియాలంటే, సినిమా చూడాలి. ప్రతి డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తారు. ఈ డాక్టర్‌ చేసే ఆపరేషన్‌ డిఫరెంట్‌. హీరో పేరు వరుణ్‌. అతను ఆర్మీ డాక్టర్‌. సొంతూరుకు వచ్చి ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అనేది కథ. ట్రైలర్‌లో చూపించినట్టు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ సినిమాలో ఉన్నాయి. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమాలో చూడాలి.

 

ట్రైలర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంది… ఈ జోనర్ లో ఇది తొలి చిత్రం అనుకోవచ్చా?

యాక్షన్‌, థ్రిల్‌ మూడ్‌లో సినిమా ఉంటుంది. కానీ, సినిమాలో ఎక్కువ ఫైట్స్‌ లేవు. రెండు ఫైట్స్‌ మాత్రమే ఉన్నాయి. హీరో, విలన్‌ మధ్య థ్రిల్‌ మూమెంట్స్‌ చాలా ఉంటాయి. నేరుగా కొట్టుకోరు. కానీ, ఇద్దరి మధ్య మైండ్‌ గేమ్‌ నడుస్తుంది. ఫిజికల్‌ ఫైట్‌ కాకుండా మెంటల్‌ ఫైట్‌లా సినిమా ఉంటుంది. ఎవరు తెలివైనవారు అనే అంశం మీద నడుస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే, కొంచెం హ్యూమర్‌, కొంచెం థ్రిల్‌ ఇస్తుంది.

 

సొంతంగా ఎందుకు నిర్మించాలి అనుకున్నారు?

దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. టీవీలో నేను షోస్‌ చేసినప్పటి నుంచి తెలుసు. నేను 2007లో టీవీ కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే, ఆ షోను నెల్సన్‌ డైరెక్ట్‌ చేశాడు. తనపై నాకున్న నమ్మకమే సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి కారణం. సినిమా ఫస్ట్‌ కాపీ వరకూ ప్రొడ్యూస్‌ చేయడం నా పని. ఆ తర్వాత మొత్తం విడుదల వ్యవహారాలు కె.జె.ఆర్‌ స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌ చూస్తారు.

 

సినిమా లో మీ పాత్ర ఎలా ఉంటుంది.

పోస్టర్‌ చూస్తే, నాతో పాటు చాలామంది నటీనటులు కనిపిస్తారు. ప్రతి పాత్రకు ఓ పర్పస్‌ ఉంటుంది. వాళ్లు సినిమా అంతా ఉంటారు. వాళ్లందరూ కామెడీ చేస్తారు, నేను తప్ప. నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ట్రైలర్‌ చూస్తే, అందులో ఎటువంటి ఎమోషన్‌ లేకుండా కనిపిస్తానో, అలా. వరుణ్‌ పాత్ర భావోద్వేగాలను బయటకు చూపించదు. ఎప్పుడూ నవ్వడు, ఏడ్వడు, కోప్పడడు. ఎటువంటి ఎమోషన్‌ లేకుండా నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో నాకు ఎదురైన ఛాలెంజ్‌ అదే. కామెడీ సన్నివేశాలు చిత్రీకరించేప్పుడు నేను నవ్వితే, నెల్సన్‌ అరిచేవాడు. నువ్విలా చేస్తే సీన్‌ రెండో రోజు చేయాలి. అప్పుడు ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెరుగుతుంది. ఓకేనా? అని అడిగితే, మౌనంగా ఉండేవాడిని.

 

డాన్స్ ఎలా మేనేజ్ చేశారు.

అది డాన్స్ మాస్టర్ గారిని అడగాలి. ఈ లవ్ టు డాన్స్.

 

ప్రియాంక అరుల్ మోహన్ తో లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది?

లవ్‌ ఎపిసోడ్‌ పెద్దగా ఉండదు. హీరో హీరోయిన్‌ మధ్య బ్రేకప్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అంతకన్నా ఎక్కువ చెప్పలేను.

 

ఓటిటి లో విడుదల చేయాలని అనుకున్నారా?

కరోనా తొలి దశలో వేచి చూడాలనుకున్నాం. అప్పటికి 80 శాతం చిత్రమే పూర్తయింది. ఫిబ్రవరికి సినిమా పూర్తయింది. విడుదల గురించి ఆలోచిస్తున్న టైమ్‌లో సెకండ్‌ వేవ్‌ వచ్చింది. ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. అప్పుడు కోటపాడి జె. రాజేష్‌తో మీకు ఏది రైట్‌ అనిపిస్తే అది చేయండి అని చెప్పాను. ఆయన థియేటర్లలో విడుదల చేయడానికి మొగ్గుచూపారు. ఓటీటీ కోసం కాదు. థియేటర్ల కోసమే సినిమా చేశాం.

 

కరోనా కి ముందు తెలుగు లో విడుదలైన చివరి చిత్రం మీ శక్తి, నిర్మాత తో ఉన్న అసోసియేషన్ గురించి

అవును, లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు తెలుగులో ఆ సినిమా విడుదలైంది. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ను అప్రిషియేట్‌ చేయాలి. లేదంటే ఓటీటీకి సినిమా వెళ్ళేది. తమిళనాడులో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను అప్రిషియేట్‌ చేస్తున్నారు. అక్కడ సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలవుతున్న భారీ సినిమా ఇదే. ఇన్నాళ్ళూ ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలతో ఇంట్లో ఉన్న పేరెంట్స్‌ కూడా సినిమా చూడటానికి థియేటర్లకు వస్తారని నమ్ముతున్నా అని అన్నారు.

 

అనిరుద్, డైరెక్టర్ తో డిస్కషన్ చేసిన వీడియో విడుదల పై

జనరల్‌గా మేం మాట్లాడుకునేదాంట్లో 10 శాతం మాత్రమే చూపించాం. మా డిస్కషన్స్‌ అలానే ఉంటాయి. ఫస్ట్‌ చెల్లమ్మ, తెలుగులో చిట్టమ్మ పాట రాశా. తర్వాత సో బేబీ, చాలామందితో రాయించాం. కుదరలేదు. నువ్వు రాయి అన్నారు. ట్రై చేశా. చెల్లమ్మ సాంగ్‌ ముందు సినిమాలో అవసరం లేదు. ఎందుకంటే, బ్రేకప్‌తో మొదలవుతుందని చెప్పా కదా. అనిరుధ్‌ సాంగ్‌ ఎక్కడ పెడతారు? అని అడిగారు. అది తర్వాత చూద్దాం, ముందు నువ్వు చెయ్‌ అని చెప్పాం. హ్యాపీగా రాశా. సినిమాలో మంచి సందర్భం కుదిరింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. వీడియో చూసి బుట్టబొమ్మ లా ఉందని చెబుతున్నారు.

ఈ చిత్రం కోసం ఫస్ట్ టైం గోవా కి వెళ్ళా. ఎక్కువగా సౌత్ దాటి బయటికి వెళ్ళను. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రదేశాలకు ఎక్కువగా వెళ్తాను.

 

తెలుగు లో సినిమా ఎప్పుడు మొదలు కానుంది?

నిర్మాతలే అధికారికంగా సినిమా వివరాలు ప్రకటిస్తారు. ఆ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నా. నాకు తెలుగు కొంచెం వచ్చు. మీరు మాట్లాడేది అర్థమవుతుంది. నెక్ట్స్‌ టైమ్‌ హైదరాబాద్‌ వస్తే, పూర్తిగా తెలుగులో మాట్లాడతా. ఈ సినిమా నా ప్లాన్‌లో లేదు. సెకండ్‌ వేవ్‌లో ఓ ఫ్రెండ్‌ ఇటువంటి కథ ఉంది అని చెప్పాడు. దర్శకుడికి నేను చేయగలననే నమ్మకం ఉంది. ఓకే చేశా. ఈ సినిమా చేయడానికి హీరోయిన్లందరూ నాకు స్ఫూర్తి. వాళ్లు ఓ రోజు చెన్నైలో, మరో రోజు హైదరాబాద్‌లో, ముంబైలో చిత్రీకరణ చేస్తారు. డైలాగులు రాసుకుని, మీనింగ్‌ తెలుసుకుని ప్రాక్టీస్‌ చేస్తారు. నేనూ అలా కష్టపడాలని అనుకుంటున్నా అని అన్నారు.

 

కొత్త చిత్రం అంటే ఎలా డిఫైన్ చేస్తారు?

ఇప్పటి వరకు నేను చేయని చిత్రం. బేసిక్ స్క్రిప్ట్ అంటే ఎంటర్ టైన్మెంట్. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఫస్ట్ టైం ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు