‘అల్లూరి’ టీజర్ లాంచ్ లో శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

‘అల్లూరి’ టీజర్ లాంచ్ లో శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jul 4, 2022 12:20 PM IST


హీరో శ్రీవిష్ణు తన తదుపరి చిత్రం అల్లూరిలో పోలీసుగా నటిస్తున్నాడు, ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘మా ‘అల్లూరి’ టీమ్ అందర్ని విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికి పేరు పేరున నా నమస్కారం, అండ్ చాలా థాంక్స్ అండి. అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతి అని.. ఈ రోజు మా సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తే మంచిది అని.. సడెన్ గా అప్పటికప్పుడు ఈ టీజర్ ను రెడీ రిలీజ్ చేశాము. ఈ సినిమా ప్రయాణంలో నేను అల్లూరి సీతారామరాజును చూడలేదు గానీ, అంతే పవర్ ఫుల్ వ్యక్తిని చూశాను అండి, అతనే ఈ సినిమా దర్శకుడు ప్రదీప్ అండి. నేను వెరీ హ్యాపీ.. ప్రేక్షకులందరికీ కూడా ఈ టీజర్ బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

నా దృష్టిలో ఇండియాకి హీరోలు అంటే.. సోల్జర్స్, పోలీస్ అండ్ డాక్టర్స్ మాత్రమే. అందుకే.. ఈ మూడు పాత్రల్లో నాకు ఏ పాత్ర వచ్చినా.. చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తాను. ఈ సినిమా కథతో నాకు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్ర దొరికింది. ఈ కథ విన్నాక, నేనెందుకు పోలీస్ అవ్వలేదా అని బాధ పడ్డాను. అంత గొప్పగా ఉంటుంది నా పాత్ర. ఇది కల్పిత ఓ పోలీస్ బయోపిక్. ఈ కథతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక నన్ను లాంచ్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారితోనే నేను నా సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేస్తున్నాను. అల్లూరి టీంలో ప్రతి ఒక్కరూ బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు. మీరందరూ మా ‘అల్లూరి’ ని బాగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’ అంటూ శ్రీవిష్ణు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు