ఇళయదళపతి విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీకాంత్

ఇళయదళపతి విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీకాంత్

Published on Dec 25, 2022 1:08 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వరిసు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన వరిసు 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ పై తెలుగు ఆడియన్స్ లో సైతం మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక నిన్న రాత్రి వరిసు ఆడియో రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఎంతో గ్రాండ్ గా జరుగగా ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్న తెలుగు నటుడు హీరో శ్రీకాంత్, ఇలయలదళపతి విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఆయన మాట్లాడుతూ, నిజానికి విజయ్ రియల్ లైఫ్ సూపర్ స్టార్ అని, తన కెరీర్ లో అసలు అటువంటి మంచి మనసున్న గొప్ప హీరోని తాను ఇప్పటివరకు చూడనేలేదని అన్నారు. తాను 125 వరకు సినిమాలు చేసినప్పటికీ అటువంటి వ్యక్తి నుండి తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీగా రూపొందుతోన్న వరిసు తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని, అలానే పొంగల్ విన్నర్ గా కూడా వరిసు నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు