“ఈ విశ్వమంతము వ్యాపించిన” పాటను రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్..!

Published on Nov 12, 2021 10:00 am IST

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక హీరో హీరోయిన్ లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం భగత్ సింగ్ నగర్. తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమాలోని ఈ విశ్వమంతము వ్యాపించిన పాటను హీరో శ్రీకాంత్, బెనర్జీ లు విడుదల చేశారు.

ఈ సందర్భం గా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, “భగత్ సింగ్ నగర్ ఆ పేరు లో ఉండే పవర్, యాక్షన్ టీజర్ లోనూ, ప్రకాష్ రాజ్ గారు రిలీజ్ చేసిన చరిత చూపని సాంగ్ లోనూ స్పష్టంగా కనపడుతుంది. అదే రేంజ్ లో ఏ మాత్రం తగ్గకుండా ఈ విశ్వమంతము వ్యాపించిన పాట ప్రస్తుత పరిస్థితులకి అద్దం పెట్టినట్టుగా ఉంది. ఒక కొత్త టీం కొత్త కథలతో సినిమాలు తీయడం వారి మంచి ప్రయత్నాని ప్రోత్సహించడం మన భాద్యతగా భావించి ఆశీర్వదిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు మనకి వస్తాయి” అని అన్నారు.

బెనర్జీ గారు మాట్లాడుతూ, “భగత్ సింగ్ నగర్ సినిమాలో నేను నెగటివ్ షేడ్స్ ఉన్న మంచి క్యారెక్టర్ చేసాను. సినిమాకు కధే బలం ఆ కథను దర్శకుడు క్రాంతి వాలాజా చాలా బాగా ప్రెజెంట్ చేసాడు. చాలా మంది కొత్త నటీనటులు టెక్నిషన్స్ తో పాటు సీనియర్ యాక్టర్స్, అవార్డు విన్నింగ్ టెక్నీషియన్స్ తో కలిపి ఒక మంచి సినిమాగా మన ముందుకు తీసుకు వస్తున్న గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ కు, ప్రొడ్యూసర్స్ గౌరీ వాలాజా, రమేష్ ఉడత్తు గార్లకు, డైరెక్టర్ క్రాంతి వాలాజాకు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాకర్ దమ్ముగారికి శుభాకాంక్షలు” అని అన్నారు.

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జియాన్ శ్రీకాంత్ ఎడిటర్, రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి సినిమాటోగ్రాఫర్లు గా వ్యవహరిస్తున్నారు. ప్రభాకర్ దమ్ముగారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం వాలాజా క్రాంతి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :