శ్రీరామ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది మేజ్’.. ఆకట్టుకుంటున్న ‘రివర్స్ టీజర్’

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘ది మేజ్’. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం ‘రివర్స్ టీజర్’ను విడుదల చేసింది. శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ పతాకాలపై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్, డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కథానాయకుడి గతం, అతను నమ్మే నిజాలు, వాటి చుట్టూ సాగే పరిశోధన (ఇన్వెస్టిగేషన్) నేపథ్యంలో ఈ టీజర్‌ను సరికొత్తగా రివర్స్ స్క్రీన్‌ప్లే తరహాలో రూపొందించారు. భ్రమలు, వాస్తవాల మధ్య హీరో చేసే అన్వేషణను టీజర్‌లో ఆసక్తికరంగా ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమాలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా, శివ కృష్ణ సినిమాటోగ్రఫీ, సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version