ఓటీటీలో విడుదల కాబోతున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’..!

Published on Jan 20, 2022 11:36 pm IST

ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తూ ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యింది ‘జీ 5’ ఓటీటీ వేదిక. అయితే లేటెస్టుగా మరో సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి ‘జీ 5’ రెడీ అవుతోంది.

అక్కినేని మేనల్లుడు సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. అయితే ఫిబ్రవరిలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి ‘జీ 5’ సన్నాహాలు చేస్తోంది.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ మొదలైంది’. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘జీ 5’ ఓటీటీలో ఈ నెల 21న ‘లూజర్’ సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘మళ్ళీ మొదలైంది’తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం :