షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కామెడీ సినిమా !

Sundeep Kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ మళ్లీ కామెడీనే నమ్ముకుంటున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి మంచి ఎంటర్ టైనర్ తో హిట్ అందుకున్న సందీప్కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయి కామెడీ సినిమాను చెయ్యలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో ఒక సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఈ సినిమాకు ‘తెనాలి రామకృష్ణ బిఎబిఎల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిలే ఫన్నీగా ఉండటంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. కాగా కర్నూలులో ఫిబ్రవరి 5 వ తేదీ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. డిసెంబర్ 14 నుండి మొదలుకానున్న ఈ సినిమాలో హన్సిక కథానాయకిగా నటించనుంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Exit mobile version