‘గజ తుఫాన్ ’ బాధితుల‌కు స్టార్ హీరో ఫ్యామిలీ 50 లక్షలు విరాళం !

‘గజ తుఫాన్ ’ బీభత్సం కారణంగా తమిళనాడులోని దక్షిణ ప్రాంతం ప్రజలు తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. వారి బాధకి తమిళ్ సినీరంగ ప్రముఖులు తమవంతుగా ఆర్ధిక సహాయం చేయడం మొదలు పెట్టారు. గజ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి సూర్య కుటుంబం రూ.50 లక్షల విరాళం ప్రకటించింది.

సూర్య, కార్తి, శివకుమార్, జ్యోతిక, 2డి ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మొత్తం రూ.50 లక్షల రూపాయిలను బాధితుల సహాయార్థం కొరకు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సూర్యకు అత్యంత సన్నిహితుడైన రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ ట్వీటర్ ద్వారా తెలియజేశారు.

కాగా, సూర్య ఫ్యామిలీ భారీ విరాళం ప్రకటనతో.. ఇక మిగిలిన తమిళ స్టార్ హీరోలు కూడా తమ వంతుగా విరాళాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే గజ తుఫాన్ కారణంగా తమిళనాడులోని డెల్టా ప్రాంతమంతా అతలాకుతలం అయిపోయింది.

On behalf of #ActorSivakumar family #SriSivakumar @Suriya_offl @Karthi_Offl #Jyotika & @2D_ENTPVTLTD donating a sum of Rs. 50 Lakhs through NGOs towards #GajaCycloneRelief #GajaCyclone #LetsAllJoinHands #prayfordelta

— rajsekarpandian (@rajsekarpandian) November 19, 2018