మాస్ మహారాజ మూవీలో హీరో సుశాంత్.. లుక్ అదిరిందిగా..!

Published on Jan 12, 2022 1:52 am IST

మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ‘ఖిలాడీ’,’టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర‘ చిత్రాన్ని చేస్తున్నాడు. జనవరి 14న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రవితేజ లాయర్‌గా విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లకు సూపర్‌ రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ సినిమాలో మరో పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. యంగ్‌ హీరో అక్కినేని సుశాంత్‌ ఈ సినిమాలో రామ్‌ పాత్రలో అలరించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. సుశాంత్ లుక్‌ చూస్తుంటే లాంగ్‌ హెయిర్‌తో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :