“అద్బుతం” చిత్రం గురించి హీరో తేజ సజ్జ కీలక వ్యాఖ్యలు!

Published on Nov 18, 2021 6:54 pm IST

ఈ ఏడాది ఇష్క్ మరియు జాంబి రెడ్డి చిత్రాలతో అలరించిన నటుడు తేజ సజ్జా, ఇప్పుడు మరొక చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. తేజ సజ్జ హీరోగా, శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం అద్బుతం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల కి సిద్దమవుతున్న నేపథ్యం లో తేజ సజ్జ మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.

అద్బుతం సినిమా ఎలా మొదలైంది అంటే…

ఈ సంవత్సరం ఇది నాకు మూడవ రిలీజ్. 2017 లో ఒక ఐడియా అనుకోవడం జరిగింది. అయితే ముందుగా ఓహ్ బేబీ ఆఫర్ రావడం, ఇది కాస్త ఆలస్యంగా మొదలు అయ్యింది. అంతేకాక మధ్య లో పాండెమిక్ కారణం గా ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ అద్భుతం కథ మాత్రం ఎన్నో ట్విస్ట్ లతో ఉంటుంది.

మొదటి రెండు సినిమాలు థియేటర్ల లో విడుదల అయ్యాయి. ఈ చిత్రం ఓటిటి ద్వారా విడుదల కానుంది. ఈ సినిమా కథ చాలా బాగా నచ్చి ఓకే చెప్పా. ఒక కొత్త జానర్ కథ ను చేసినప్పుడు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ప్రేక్షకులకు అసక్తి క్రియేట్ చేయడానికి ఒక కొత్త జానర్ ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తా. అలాంటి కొత్త జానర్ సినిమానే అద్బుతం.

నేను కమర్షియల్ చిత్రం ఎప్పుడు చేయలేదు. అందరూ చేసే కమర్షియల్ సినిమా చేస్తే, నన్ను చూడటానికి ఒక కారణం ఉండాలి కదా. ఒక రీజన్ ఆడియన్స్ కి క్రియేట్ చేయడానికి సినిమా చేశా.

శివాని చాలా కమర్షియల్ హీరోయిన్ చేసినట్లు చేసింది. ఇది లవ్ స్టోరీ. ఇందులో సేమ్ నంబర్ తో హీరో హీరోయిన్ కనెక్ట్ అయ్యి, ఎలా కలుస్తారు, ఇలా చేయడం జరిగింది. ఇందులో చాలా ఎక్కువ కథ ఉంటుంది. ఇది కొత్త కథగా వస్తున్న కమర్షియల్ సినిమా. హీరో అవ్వడానికి ఏం కావాలో అన్ని నేర్చుకున్నా, కానీ వీటన్నిటికీ ముందు మంచి కథ పట్టుకోవాలి అని తెలుసుకున్నా.

ఒకే ఏడాది సక్సెస్ వచ్చింది, ఫెయిల్యూర్ వచ్చింది. సక్సెస్ ఎంజాయ్ చేయలేదు కానీ, ఇష్క్ కి మాత్రం స్ట్రైక్ అయింది. నా సైడ్ తప్పు ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు, మేకింగ్ లో ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ అది రీమేక్. సబ్జెక్ట్ మ్యాటర్.

సంబంధిత సమాచారం :

More