హీరో ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Jan 8, 2022 12:02 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా నటించిన తొలి చిత్రం ఈ సంక్రాంతికి జనవరి 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌లో అశోక్ తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు, హీరో సినిమా ట్రైలర్ విడుదల కి సమయం ఆసన్నమైంది.

జనవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు తిరుపతి లోని నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇది గ్రాండ్ గా జరగబోతోంది. అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ కథానాయిక గా నటిస్తుంది. జగపతిబాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :