త్రివిక్రమ్ సినిమాలో తండ్రిగా కన్నడ సూపర్ స్టార్?

త్రివిక్రమ్ సినిమాలో తండ్రిగా కన్నడ సూపర్ స్టార్?

Published on Jul 4, 2022 7:00 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో తండ్రి పాత్ర ఉందని.. సినిమాకే కీలకమైన ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ పాత్రలో మరో పేరు వినిపిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మహేష్ కి ఫాదర్ గా కనిపించబోతున్నాడట. అయితే.. కేవలం ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఉపేంద్ర పార్ట్ ఉంటుందని.. మహేష్ – ఉపేంద్ర కాంబినేషన్ లో సీన్స్ ఉండవు అని తెలుస్తోంది.

ఇక పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే త్రివిక్రమ్ కూడా మహేష్ కి సరిపోయే పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు