ఇంటర్వ్యూ : క‌ర్త క‌ర్మ క్రియ హీరో వ‌సంత్‌ – జూ ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టం !

 

యువ ద‌ర్శ‌కుడు నాగు గ‌వ‌ర ద‌ర్శ‌క‌త్వం లో క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస్ నిర్మించిన ఈచిత్రం ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతోంది. ఈ సందర్భంగా ఈచిత్రం హీరో వ‌సంత్ సమీర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం ..

ఈ సినిమా అవ‌కాశం మీకు ఎలా వ‌చ్చింది ?

నాకు ఈ సినిమా అవ‌కాశం ఒక కామ‌న్ ఫ్రెండ్ హ‌ర్ష ద్వారా వ‌చ్చింది. ‘కర్త కర్మ క్రియ’ అనే సినిమాకు ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని చెప్పి న‌న్ను అక్క‌డ‌కి పంపించారు. అప్ప‌టికే నేను రెండేళ్ళ నుంచి వేరే వేరే ఆడిష‌న్స్ చేసి ఉన్నాను. శ్రీ‌నివాస్‌గారికి నాగుగారు న‌న్ను చూపించారు. చూసి బానేవున్నావు అన్నారు. ఒక ట్రైయిల్ షూట్ చేసి చూపించారు. దాంతో వెంట‌నే అయాన ఓకే అన్నారు.

హీరోగా ఇదే మీ మొదటి చిత్రమా ?

అవునండి . నేను చిన్న‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. గోల్కొండ హైస్కూల్ చిత్రంలో చిన్న‌ప్ప‌టి సుమంత్ క్యారెక్ట‌ర్‌లో న‌టించాను. త‌ర్వాత జోష్ చిత్రంలో చిన్న‌ప్ప‌టి నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్‌లో చేశాను. పెద్ద‌య్యాక ఇదే నా మొద‌టి సినిమా.

మీనేటివ్ ప్లేస్ గురించి ?

మాది వైజాగ్ జిల్లాలో అన‌కాప‌ల్లి ద‌గ్గ‌ర చోడ‌వ‌రం. చిన్న‌ప్పుడు సెకండ్ క్లాస్ వ‌ర‌కు అక్క‌డే చ‌దివాను. థ‌ర్డ్ క్లాస్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చాము. 2016లో నేను నా మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌ని కంప్లీట్ చేశాను. అది అయిన త‌ర్వాత మూవీస్‌లో ట్రైయిల్స్ చేస్తూ ఉన్నాను.

సినిమాల పైన ఆసక్తి ఎలా కలిగింది ?

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా స‌ర్కిల్‌లో పెరిగాను మా నాన్న‌గారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారి ద‌గ్గ‌ర రైట‌ర్‌గా ప‌నిచేశారు. షూటింగ్స్ కి వెళ్ళ‌డం అలాగే గ‌ణ‌ప‌తి కాంప్లెక్స్ ద‌గ్గ‌ర ఒక స్వ‌ర్ణ మాస్ట‌ర్స్ డాన్స్ క్లాస్ ఉంది. ఆ డాన్స్ క్లాస్ నుంచి చిన్న‌పిల్ల‌లు సినిమా షూటింగ్స్‌కి కావాలంటే తీసుకువెళ్ళేవారు. మాయాబ‌జార్ అలా రెండు మూడు సినిమాల‌కు తీసుకువెళ్ళేవారు బ్యాక్ గ్రౌండ్‌లో డ్యాన్స్ చేయించేవారు పిల్ల‌లంద‌రితో. నేను 2 ఇయ‌ర్స్ నుంచి ఆడిష‌న్స్ ఇస్తూ కూడా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారి ద‌గ్గ‌ర రైట‌ర్‌గా ప‌నిచేశాను. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారిది సోనీ టీవీలో క్రాస్ రోడ్స్ అనే ఒక షోకి ప‌నిచేశాను. అది టెలికాస్ట్ అయి రెండు నెల‌లు అవుతుంది అయిపోయి. దానికి ఒక 39 షార్ట్ స్టోరీస్‌కి ప‌నిచేశాను. హిందీ షో అది. ఆ షో చేస్తున్న టైంలోనే ఈ అవ‌కాశం వ‌చ్చింద‌ని చెపితే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు ఆయ‌న ఆశీర్వాదంతో న‌న్ను పంపించారు.

నటన పరంగా ఏమైనా శిక్షణ తీసుకున్నారా ?

బాంబే అనుప‌మ్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. నేను ఇంజినీరింగ్ చ‌దువుతున్న‌ప్పుడే హాలీడేస్‌లో వెళ్ళి నేర్చుకునేవాడ్ని. మైమ్‌ కూడా చేశాను. మార్షాల్ ఆర్ట్స్ చేశాను. హార్స రైడింగ్ కూడా నేర్చుకున్నాను. బ్యాగ్రౌండ్ లేనప్పుడు అన్నీ నేర్చ‌కోవాలి అన్నీ వ‌స్తేనే క‌దా అవ‌కాశాలు వ‌చ్చేది. ఆడిష‌న్స్ చేస్తున్న‌ట్లు తెలిస్తే వాళ్ళ‌ని అప్రోచ్ అవ్వ‌డం నా ఫొటోస్ పంప‌డం అలా చేసే వాడ్ని. కొన్ని కొన్ని వ‌స్తాయ‌ని అనుకున్న‌వి రాక‌పోవ‌డం అలా జ‌రిగాయి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేయడం నాకు బాగా ప్ల‌స్ అయింది. సినిమాకి ద‌గ్గ‌ర‌గా ఉన్నాను.

మీ నాన్న‌గారు ఏమైనా స‌ల‌హాలు ఇచ్చారా ?

ప‌ర్స‌న‌ల్ స‌ల‌హాలు అంటే ప్రొడ్యూస‌ర్ మ‌న‌ల్ని న‌మ్మి డ‌బ్బులు పెట్టారు. ఈ సినిమా చూసి నీకు ఇంకా అవ‌కాశాలు రావాలి. ఇది నీకు మంచి ప్లాట్‌ఫార్మ్ అనుకో అని అన్నారు. మీడియా వాళ్ళంద‌రూ నా గురించి చాలా పాజిటివ్‌గా రాశారు ఆ విష‌యంలో చాలా హ్యాపీ.

సినిమా విడుద‌ల‌య్యాక మీకు లభించిన ప్రశంసలు ?

ట్రైల‌ర్ వ‌చ్చాక అంద‌రూ నా వాయిస్ చాలా బావుంద‌ని అన్నారు . క‌త్తి మ‌హేష్ కూడా ఫేస్ బుక్‌లో షేర్ చేశారు నా వాయిస్ రానా వాయిస్‌లా ఉంద‌ని ఆయ‌న‌కు నాకు ప‌రిచ‌యం లేదు బ‌ట్ ఐ యామ్ సో హ్యాపీ. వాయిస్ డిక్ష‌న్ చాలా బావుంది అన్ని ప‌దాలు చాలా స్ప‌ష్టంగా ప‌లుకుతున్నాను అని అంద‌రూ అన్నారు. సినిమా విడుద‌ల‌య్యాక కూడా కొత్త యాక్ట‌ర్‌లాగా ఎక్క‌డా అనిపించ‌లేదు చాలా మెచ్యూర్డ్ యాక్ట‌ర్‌లాగా చేశాడు అన్నారు. క్ల‌యిమాక్స్ చాలా బాగా చేశాను అన్నారు.

క్లైమాక్స్ చెయ్య‌డానికి భ‌య‌ప‌డ్డారా ?

సినిమా షూటింగ్ టైంలో భ‌య‌ప‌డ‌లేదు కాని క్ల‌యిమాక్స్ చేసేట‌ప్పుడు కొంచం భ‌య‌ప‌డ్డాను. ఎందుకంటే ఏమాత్రం స‌రిగారాక‌పోయినా క్యారెక్ట‌ర్‌ని చంపేశా అంటారు అదే బాగా చేస్తే నాకు మంచి పేరు వ‌స్త‌ది అని టెన్ష‌న్ ప‌డ్డాను. కాని సింగిల్ టేక్‌లో చేశాను. ర‌వివ‌ర్మ‌గారు చూస్తూ ఉన్నారు నువు ఎలా చేస్తావో చూస్తాను అని సింగిల్ టేక్‌లో చేయ‌డంతో ఆయ‌న లేచి క్లాప్స్ కొట్టారు.

మీ తదుపరి చిత్రల గురించి ?

ముగ్గురు అప్రోచ్ అయ్యారు. నేను ఇంకా ఏదీ ఫైన‌లైజ్ చెయ్య‌లేదు. మంచి ప్రొడ‌క్ష‌న్‌, మంచి స్క్రిప్ట్ చూసుకుని వెళ‌దామ‌ని చూస్తున్నాను. నా కెరీర్‌కి ప్ల‌స్ అవ్వాల‌ని.

మీరు ఫ్యూచ‌ర్‌లో చెయ్యాల‌నుకునే డ్రీమ్ రోల్‌ ?

మైథాల‌జీ, పీరియాడిక్, ఫోక్‌లోర్‌ ఈ మూడు జోన‌ర్స్ ఎప్ప‌టికైనా చెయ్యాల‌ని చేస్తాను. ఎందుకంటే నాకు చిన్న‌ప్ప‌టి నుంచి పౌరాణిక డైలాగులు నేను ప్రాక్టీస్ చేసే వాడ్ని ఎవ‌రైనా అవ‌కాశం ఇస్తే త‌ప్ప‌కుండా చేస్తాను. రీసెంట్‌గా దాన‌వీర సూర‌క‌ర్ణ‌లో డైలాగ్‌లో లైవ్‌లో మ‌హాన్యూస్‌లో చెప్పాను.

మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

న‌టుడిగా నాకు సీనియ‌ర్ ఎన్టీఆర్‌గారి పౌరిణికాలు బాగా చూసేవాడ్ని అవి బాగా ఇష్టం. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కూడా బాగా ఇష్టం.మంచి పేరొచ్చిన క్యారెక్ట‌ర్స్ అంటే ఇష్టం బిజినెస్‌మ్యాన్‌లో మ‌హేష్‌బాబుగారు అలా ఇన్‌టెన్స్ ప‌ర్ఫార్మెన్స్‌, సీరియ‌స్ రోల్స్ బాగా ఇష్టం.

మీ బాలలు , బలహీనతలు గురించి ?

నా ప్ల‌స్ డైలాగ్స్. ఎటువంటి డైలాగ్స్ అయినా చాలా బాగా చెప్ప‌గ‌ల‌ను .డైలాగ్ డిక్ష‌న్‌, పెర్ఫార్మెన్స్‌గాని నేనొకడ్ని ఉన్నానని గుర్తించాల‌ని కోరుకుంటున్నాను. డైలాగ్ నా బ‌లం. మైన‌స్‌లు రెండు మూడు చోట్ల నా బాడీ ల్యాంగ్‌వేజెని క‌రెక్ట్ చెయ్యాల‌నిపించింది అంతే. సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు అనిపించింది. డైరెక్ట‌ర్‌గారు చిన్ అప్‌చేస్తున్నావ్ కొంచం డ‌వున్ చెయ్యిమ‌ని చిన్న క‌రెక్ష‌న్ చెప్పేవారు అంతే.

ఇంత కాంపిటేష‌న్‌లో మీరు వస్తున్నారు ఎలా అనిపిస్తుంది ?

మ‌న వ‌ర్క్ మ‌న‌ల్ని కాపాడుతుంది. కాంపిటేష‌న్ అంటే ఏ ఫీల్డ్‌లోనైనా ఉంటుంది. అన్ని ర‌కాలుగా చూపిస్తే వ‌సంత్ స‌మీర్ ఉంటే చాలు అన్నీ చేసేస్తాడు అన్న థాట్ డైరెక్ట‌ర్స్‌కి వ‌స్తే చాలండి. హైట్ తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా ఉంద‌నే ఆప్ష‌న్‌లో వాళ్ళు ఉండాలి.

Exit mobile version