మే 8న హీరో వెంకట్ కమ్‌బ్యాక్ మూవీ ‘హరుడు’ విడుదల

Untitled 8 5

‘ఓజీ’, ‘అన్నయ్య’, ‘శివరామరాజు’, ‘ప్రేమ కోసం’ వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు వెంకట్.. ‘హరుడు’ చిత్రంతో హీరోగా కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్, వేసవి కానుకగా మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

సహ నిర్మాతలుగా డా. దిక్కల లక్ష్మణ రావు, డా. ప్రవీణ్ రెడ్డి వ్యవహరిస్తున్న ఈ చిత్ర టీజర్‌కు ఇప్పటికే విశేష స్పందన లభించింది. “ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్న కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ ఇది. అన్ని వర్గాల వారిని ఇది అలరిస్తుంది. వెంకట్ గారికి ఇది ఖచ్చితంగా సాలిడ్ రీఎంట్రీ మూవీ అవుతుంది” అని చిత్ర నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో శ్రీహరి, హెబ్బా పటేల్, సలోని, నటాషా, అలీ, సుమన్, రవివర్మ, సుభాశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణి జిన్నా సంగీతం సమకూరుస్తుండగా, ఆనంద్ సినిమాటోగ్రాఫర్‌గా, ఉప్పు మారుతి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Exit mobile version