రౌడీ హీరో విజయ్‌తో బుట్టబొమ్మ జత కట్టనుందా?

Published on May 7, 2022 2:59 am IST


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రెండో సినిమా ‘జనగణమన’ చేస్తున్న సంగతి తెలిసిందే. లైగర్‌ సెట్స్‌పై ఉండగానే ఈ మూవీని అనౌన్స్‌ చేశారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్ సైనికుడిగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్‌ సరసన ఎవరు నటించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో విజయ్‌ సరసన దివంగత నటి, ‘అతిలోక సుందరి’ శ్రీదేవీ కూతురు జాన్వి కపూర్‌ నటించనుందని ఈ సినిమాతో ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతోందని జోరుగా ప్రచారం జరిగింది.

అయితే ఇప్పటి వరకు ఏ సౌత్‌ సినిమాకు తాను సంతకం చేయలేదని జాన్వి కపూర్‌ క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు చెక్‌ పడింది. దీంతో మరోసారి జనగనమణలో హీరోయిన్‌ ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ‘బుట్టబొమ్మ’ పూజ హెగ్డే విజయ్‌తో జతకట్టనుందంటూ వార్తలు తెరమీదకి వార్తలు వచ్చాయి. ఇప్పటికే డైరెక్టర్ పూరి ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :