ప్రభుత్వం పై స్టార్ హీరో విమర్శలు

ప్రభుత్వం పై స్టార్ హీరో విమర్శలు

Published on Jul 1, 2024 3:55 PM IST


త‌మిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన తమిళగ వెట్రి కజగం పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. తాజాగా విజ‌య్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. టెన్త్‌, ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్ధులకు టీవీకే పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించిన విజయ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని.. దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

విజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్‌ సర్కార్‌ ఏ ప్రయత్నం చేయలేదు. తమిళనాడులో డ్రగ్స్‌ వాడకం ఎక్కువైంది. ఒక పెరేంట్‌గా, రాజకీయ పార్టీ నాయకుడిగా నేను దీన్ని గురించి భయపడుతున్నాను. యువతను డ్రగ్స్‌ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. తమిళనాడు రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరముంది’ అంటూ విజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అన్నట్టు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ పోటీ చేయబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు