స్టార్ హీరో విక్రమ్ కు పితృ వియోగం !

తమిళంతో పాటు తెలుగులో కూడా విలక్షణ నటుడిగా బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఆయనంటే ప్రతి ప్రేక్షకుడికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఇటీవలే కుమార్తె వివాహాన్ని ఘనంగా చేసి కుమారుడ్ని హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్న ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది.

ఆయన తండ్రి వినోద్ రాజ్ కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనై విక్రమ్ కు, అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 123తెలుగు.కామ్ కూడా వినోద్ రాజ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, విక్రమ్ కుటుంబానికి ఈ విపత్తును తట్టుకునే మనో ధైర్యం కలగాలని కోరుకుంటోంది.