‘సామాన్యుడు’ విడుదల థియేటర్స్‌ లోనే !

Published on Aug 30, 2021 9:10 am IST

యాక్షన్ హీరో విశాల్‌ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘సామాన్యుడు’. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ అనేది ఈ సినిమాకి పెట్టుకున్న ఉపశీర్షిక. టాలెంటెడ్ డైరెక్టర్ శరవణన్‌ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో విశాల్ పూర్తిగా కొత్తగా కనిపించబోతున్నాడు. సమాజంలో జరిగే అన్యాయాన్ని సహించలేని ఓ ఆవేశ పరుడి కథే ఇది. ఇక ఈ చిత్రంలో డింపుల్‌ హయతి హీరోయిన్‌ గా నటిస్తోంది.

కాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్‌ బర్త్‌ డే సందర్భంగా ‘సామాన్యుడు’ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్నట్టు యువ సంగీత సంచలనం యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాంగ్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయట. ఈ సినిమాను త్వరలో థియేటర్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :