స్టంట్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డ హీరో విశాల్..!

Published on Feb 12, 2022 1:30 am IST

యాక్షన్ హీరో విశాల్ “లాఠీ” సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోను విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే లాఠీ సినిమా స్టంట్ సీక్వెన్స్ చేస్తుంటే గాయాలయ్యాయని, విశ్రాంతి చికిత్స కోసం కేరళ వెళ్తున్నానని, మార్చి తొలివారంలో జరిగే ఫైనల్ షెడ్యూల్‌లో పాల్గొంటానని తెలిపాడు.

ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ ద్వారా రమణ, నంద కలిసి సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, అతడి సరసన సునయన కథానాయికగా నటిస్తుంది. ఇకపోతే ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :