‘లాఠీ’ మూవీ షూట్ లో విశాల్ కి గాయాలు

Published on Jul 4, 2022 10:00 pm IST

ప్రముఖ నటుడు విశాల్ ఇటీవల సామాన్యుడు, ఎనిమి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్స్ అందుకున్నారు. ఇక తరచు తన సినిమాల్లో ఎక్కువగా రియల్ స్టంట్స్ చేసేందుకు ఇష్టపడే విశాల్ ఇటీవల సామాన్యుడు మూవీ షూట్ లో గాయపడిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న మూవీ లాఠీ షూటింగ్ లో కూడా ఇటీవల ఆయన వేళ్ళు గాయపడడంతో కొన్నాళ్లు వాటికి చికిత్స తీసుకున్న అనంతరం లేటెస్ట్ గా ఆ మూవీ క్లైమాక్స్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు విశాల్. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా దాని షూట్ జరుగుతోంది.

ఇక ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న విశాల్ కాలికి నేడు గాయం అయింది. స్క్రిప్ట్ లో భాగంగా ఒక్కసారిగా జనం అందరూ విశాల్ ని అటాక్ చేసే సీన్ చిత్రీకరిస్తుంది యూనిట్. ఆ సమయంలో ఒక్కసారిగా అందరూ మీదకి రావడంతో విశాల్ కాలికి గాయం అయింది. షూట్ జరుగుతున్న సమయంలో కాలి నొప్పితో క్రింద పడిపోయిన విశాల్ కి అక్కడి డాక్టర్స్ టీమ్ వెంటనే చికిత్స అందించింది. అయితే కాలి గాయం ఒకింత ఇబ్బందికరంగా మారినప్పటికీ అలానే కొద్దిసేపు షూటింగ్ కొనసాగించిన విశాల్, ఆపైన మరింత ఇబ్బంది పడడంతో వెంటనే షాట్ నిలిపివేసింది యూనిట్. ప్రస్తుతం విశాల్ రెస్ట్ తీసుకుంటున్నారని, ఆయన పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ మళ్ళి మొదలెడతాం అని అంటోంది యూనిట్. హెచ్ వినోద్ తీస్తున్న లాఠీ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :