విశాల్ “లాఠీ” ఫస్ట్ లుక్ అదిరిందిగా..!

Published on Apr 6, 2022 10:58 pm IST

యాక్షన్ హీరో విశాల్ హీరోగా, ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం “లాఠీ”. రానా ప్రొడక్షన్స్ ద్వారా రమణ, నంద కలిసి సంయుక్తగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇందులో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఖాకీ డ్రెస్ లో లాఠీ పట్టుకుని ఒళ్లంతా గాయాలతో వెనక్కి తిరిగి నిలబడి ఉన్న విశాల్ ఇంటెన్సివ్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఇకపోతే పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ సన్నివేశాలకు నేతృత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :