‘లాఠీ’తో వచ్చేస్తున్న హీరో విశాల్..!

Published on Oct 18, 2021 8:54 pm IST


యాక్షన్ హీరో విశాల్ హీరోగా, ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కబోతుంది. రానా ప్రొడక్షన్స్ ద్వారా రమణ, నంద కలిసి ఈ సినిమాను సంయుక్తగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి తాజాగా మేకర్స్ “లాఠీ” అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా టైటిల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. అయితే టెర్రస్‌పైన ఉన్న వేలాడదీసిన ఓ చొక్కా పోలీస్ యూనిఫాంలా మారడం, ఓ మామూలు కర్ర లాఠీలా రూపాంతరం చెందడం వంటి సన్నివేశాలతో ఉన్న వీడియో ఆసక్తిగా అనిపిస్తుంది.

అయితే ఈ సినిమాలో విశాల్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, ఆయన పాత్ర పేరు మురళీకృష్ణ అనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. అయితే యాక్షన్‌కు ప్రాధాన్యమున్న ఈ సినిమాలో సెకండాఫ్‌లో 45 నిమిషాల పాటు యాక్షన్ బ్లాక్‌లు ఉండనున్నాయి. ఈ పోరాట సన్నివేశాలకు దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వం వహించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విశాల్ సరసన సునైన నటించనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More