విశాల్ తో ప్రభాస్ డైరెక్టర్ ?

విశాల్ తో ప్రభాస్ డైరెక్టర్ ?

Published on Jun 5, 2023 3:33 PM IST

ప్రభాస్ తో రాధే శ్యామ్ తీసిన డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తమిళ యాక్షన్ హీరో విశాల్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విశాల్ కి రాధాకృష్ణ కుమార్ ఓ కథ చెప్పాడని, విశాల్ కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, విశాల్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ను – విశాల్ ను కలిపింది యూవీ క్రియేషన్స్ అని టాక్ నడుస్తోంది. మరి విశాల్ ఇమేజ్ కోసం రాధాకృష్ణ కుమార్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. నిజానికి రాధాకృష్ణ కుమార్, శివ కార్తీకేయన్ తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా విశాల్ పేరు వినిపిస్తోంది. విశాల్ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని రాధాకృష్ణ కుమార్ ఫీల్ అయ్యాడు. విశాల్ తన కొత్త ప్రాజెక్టు పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు