ఏపీ ఎన్నికల్లో పోటీ పై … హీరో విశాల్ క్లారిటీ

Published on Jul 2, 2022 1:30 am IST

కోలీవుడ్ నటుడు విశాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా ఎంతో సుపరిచితం. ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులోకి డబ్ కాబడి మంచి విజయవంతం అయినవి చాలానే ఉన్నాయి. ఆ విధంగా అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ దక్కించుకున్నారు విశాల్. ఇక ప్రస్తుతం డిటెక్టీవ్ 2, లాఠీ సినిమాలు చేస్తున్నారు విశాల్. ఇక మొదటి నుండి ఏవిషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అలవాటు గల విశాల్ పై కొద్దిరోజులుగా ఒక వార్త మీడియాలో ప్రచారం అవుతోంది.

ఆయన ఆంధ్ర రాజకీయాల్లోకి రానున్నారని, అలానే కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు పై పోటీ చేయనున్నారు అనే వార్తలు తన వరకు చేరడంతో ఫైనల్ గా వాటిపై నేడు స్పందించిన విశాల్, అసలు తనకు ఏపీ పాలిటిక్స్ లోకి రావాలనే ఉద్దేశ్యం లేదని, అలానే చంద్రబాబు పై పోటీ చేయనున్నాను అనేది కూడా పూర్తిగా అవాస్తవం అని, నిజానికి రాజకీయ విషయాలకు సంబంధించి అసలు తనను ఎవరూ కలవలేదని అన్నారు విశాల్. సినిమాలు చేయడమే తనకు తెలుసునని, ప్రస్తుతం వాటిపైనే గట్టిగా దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఇక కొందరు కావాలని చేస్తున్న ఈ దుష్ప్రాచాలను ప్రజలు ఎవరూ కూడా నమ్మవద్దని కోరారు విశాల్.

సంబంధిత సమాచారం :