‘కెజిఎఫ్ – 3’ పై ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన హీరో యష్

‘కెజిఎఫ్ – 3’ పై ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన హీరో యష్

Published on Nov 6, 2022 7:00 AM IST

ఇటీవల యాష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ లో తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ పాన్ ఇండియా సినిమాలుగా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి అన్నింటా అతి పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చాప్టర్ 1 ని మించేలా మరింత భారీ సక్సెస్ అందుకున్న కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో చాప్టర్ 3 కూడా ఉందనే చిన్న హింట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దానితో చాప్టర్ 3 పై అప్పటి నుండి ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. అలానే ఆ క్రేజీ కాంబో సినిమా త్వరలోనే రూపొందనుంది అనే వార్తలు కూడా ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

అయితే నిన్న ముంబై లో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో లో భాగంగా కెజిఎఫ్ చాప్టర్ 3 ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్నకు ఫైనల్ గా స్పందించారు హీరో యష్. ఆయన మాట్లాడుతూ, కెజిఎఫ్ సిరీస్ లోని రెండు సినిమాలను ఆడియన్స్ ఎంతో ఆదరించి మా అందరినీ ఎంతో అక్కున చేర్చుకున్నారని, అయితే వాటికి కొనసాగింపుగా చాప్టర్ 3 మూవీ త్వరలో తెరకెక్కుతుందని తాను భావించడం లేదని అన్నారు. ఇక ఆ మూవీ పై ప్రస్తుతం ప్రచారం అవుతున్న కథనాలు ప్రేక్షకాభిమానులు ఎవరూ నమ్మవద్దని చెప్పిన యష్, ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా అప్ డేట్ ఉంటే తానే స్వయంగా అందరికీ తెలియచేస్తానని క్లారిటీ ఇచ్చారు. దానితో కెజిఎఫ్ మూవీ లవర్స్ లో చాప్టర్ 3 పై ఒకింత నిరాశ ఏర్పడింది. అయితే యష్ మాటలను బట్టి పక్కాగా కెజిఎఫ్ చాప్టర్ 3 ఎప్పుడు తెరకెక్కుతుంది అనేది తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు మూవీ అనలిస్టులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు