‘సలాం రాఖీ భాయ్‌’ అంటూ పాడిన యశ్ కూతురు.. వీడియో వైరల్..!

Published on May 1, 2022 3:00 am IST


కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీఎఫ్ చాప్టర్-1” సంచలనాలు సృస్టించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీయఫ్‌ 2 కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1000కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టుకుంది.

ఇదిలా ఉంటే హీరో యశ్‌ ప్రస్తుతం కేజీయఫ్‌ 2 సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఇంతకాలం షూటింగ్‌తో ఫుల్‌ బిజీగా ఉన్న యశ్‌ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. ఈ వెకేషన్‌లోనే కూతురు ఐరాతో యశ్‌ ఈ రోజు తన డేను స్టార్ట్‌ చేశాడు. ఉదయం లేవగానే ఐరాతో ఆడుకుంటున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేశాడు యశ్‌. ఆ వీడియోలో “సలాం రాఖీ భాయ్‌.. రారా రాఖీ..” అంటూ ఐరా ఎంతో క్యూట్‌గా పాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :