లేటెస్ట్ : ఫ్యాన్స్ కి హీరో యాష్ ఇంపార్టెంట్ మెసేజ్

Published on Jan 6, 2023 12:31 am IST

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో హీరోగా కెరీర్ పరంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు స్టార్ హీరో యష్.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీస్ పాన్ ఇండియా సినిమాలుగా విడుదలై అన్ని భాషల్లో కూడా సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో రాఖీ భాయ్ గా యష్ పవర్ఫుల్ యాక్టింగ్ కి అన్ని భాషల ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. అయితే విషయం ఏమిటంటే, తన పుట్టిన రోజు జనవరి 8 సందర్భంగా ఫ్యాన్స్ కి నేడు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ని ప్రకటన రూపంలో అందించారు యష్.

తనపై ప్రేక్షకాభిమానులు అందరూ చూపిస్తున్న ప్రేమకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు, ముఖ్యంగా తన ఫ్యాన్స్ ప్రేమ నిజంగా వెలకట్టలేదని తెలిపారు. ప్రతి ఏడాది తనకు పుట్టినరోజు జరుపుకోవడం పెద్దగా ఆసక్తి ఉండదని, అయితే ఫ్యాన్స్ కోసం ఇష్టంగా జరుపుకుంటానని తెలిపారు. ఇక ఈ ఏడాది పుట్టినరోజుకి తాను తన ఊరిలో ఉండడం లేదని, అలానే తన నుండి వస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్న అప్ డేట్ అతి త్వరలోనే వస్తుందని, అందుకే మరికొన్నాళ్లపాటు అభిమానులు వెయిట్ చేయాలని తన నెక్స్ట్ మూవీ గురించి ఒకింత హింట్ ఇచ్చారు యష్. మొత్తంగా యష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :