మహా సముద్రం లో ఆ హీరోయిన్ పాత్ర పై క్లారిటీ ఇదే!

Published on Oct 12, 2021 2:55 pm IST


శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన కథ పై ఇంకా క్లారిటీ కూడా రాలేదు. ఈ చిత్రం లో హీరోయిన్ అను ఇమ్మన్యూయేల్ పాత్ర పై ఒక క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం లో హీరోయిన్ అను లాయర్ పాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలు చేసిన అను ఇమ్మాన్యయేల్ ఈ చిత్రం లో హై ఇంటెన్స్ తో ఉండే పాత్రలో కనపడనుంది. ఈ చిత్రం లో అదితి రావ్ హైదరి చుట్టూ సినిమా ఉండనుంది అని తెలుస్తోంది. ఈ చిత్రం లో జగపతి బాబు, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :