
మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. అల్లు శిరీష్ చేసిన గౌరవం విమర్శకులను మెప్పించగా, కొత్త జంట సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండవ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ప్రస్తుతం తన మూడవ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. అందులో సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించడం కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు.
యువత, సోలో, ఆంజనేయులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పరశురాం చెప్పిన కథకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమాలో అల్లు శిరీష్ కి జోడీ కట్టే హీరోయిన్ ని సెలెక్ట్ చేసారు. మాకు అందిన సమాచారం ప్రకారం ‘సూర్య vs సూర్య’ సినిమాతో తెలుగుకి పరిచయం అయిన త్రిదా చౌదరిని ఫైనలైజ్ చేసారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.