బెల్లంకొండ కోసం క్రేజీ హీరోయిన్ !


శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని మేము తెలియపరిచాము. కాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కూడా ఖరారైంది. డీజే చిత్రంతో ట్రెండింగ్ గా మారిన పూజా హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ తో జత కట్టేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రం ద్వారా పూజా హెగ్డే దాదాపు కోటి రూపాయల భారీ పారితోషకం అందుకోనుందని సమాచారం.

డీజే చిత్రం విడుదల కావాల్సి ఉన్నా ఆమె లుక్స్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో టాలీవుడ్ లో పూజా హెగ్డే కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. భారీ అంచనాలు ఉన్న డీజే పై పూజా ఆశలు పెట్టుకుని ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహించే చిత్రం నిన్ననే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. కాగా షూటింగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే జాయిన్ అవుతాడు.