పవన్ – త్రివిక్రమ్ ల సినిమాకి హీరోయిన్ దొరికేసింది !

keerthi-suresh
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఆ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై సర్వత్రా చర్చలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ ఈసారికి కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారని అంటూ కొంతమంది టాప్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరికి ఆ లక్కీ హీరోయిన్ ఎవరో కొంతసేపటి క్రితమే తెలిసిపోయింది. ఆమే కీర్తి సురేష్. కీర్తి సురేష్ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘నా తరువాతి సినిమా పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నాను. త్రివిక్రమ్ దర్శకుడు. ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను’ అన్నారు. పవన్ ‘కాటరాయుడు’ షూటింగ్ పూర్తి చేయగానే వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశముంది. ‘హారిక హాసిని క్రియేషన్స్’ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రమే గాక కీర్తి సురేష్ కు మహేష్ – కొరటాల సినిమాలో కూడా అవకాశం దక్కేలా ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘నేను లోకల్’ సినిమాలో నటిస్తోంది.