చరణ్ సినిమాలో హీరోయిన్ ఖరారు !

రామ్ చరణ్‌-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌ సినిమా జనవరి 19 నుండి ప్రారంభం కానుంది. వివేక్ ఒబెరాయ్ రమ్యకృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

మొదట ఈ సినిమాలో అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం మేరకు ఈ మూవీ లో కైరా అద్వాని హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ హీరోయిన్ ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ సినిమాలో నటిస్తోంది.