రవితేజ సినిమాలో ఆ హీరోయిన్ ఖరారు !

‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ ప్రస్తుతం విక్రమ్ సిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు సినిమాలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశిఖాన్న , సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. జనవరి మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతం అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొత్త హీరోయిన్ మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోదని తెలుస్తోంది. కామిడి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాతో రవితేజ మరో హిట్ అందుకోవాలని కోరుకుందాం.