మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ నుండి తప్పుకున్న హీరోయిన్

Published on Sep 20, 2023 8:00 pm IST

యువ నటుడు మంచు విష్ణు హీరోగా మహాభారతం సిరీస్ ని తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ పాన్ ఇండియన్ మూవీ కన్నప్ప. ఇది మంచు విష్ణు యొక్క డ్రీమ్ ప్రాజక్ట్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థల పై అత్యంత భారీ స్థాయిలో నిర్మితం కానున్న ఈ ప్రాజక్ట్ యొక్క గ్రాండ్ లాంచ్ ఇటీవల జరిగింది. ఇక ఈ మూవీ లాంచ్ ఈవెంట్ లో కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా పాల్గొన్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, సాయి మాధవ్ బుర్రా కథని అందిస్తున్నారు.

విషయం ఏమిటంటే నుపుర్ సనన్ ఇందులో హీరోయిన్ గా నటించాల్సి ఉండగా డేట్స్ అడ్జస్ట్ మెంట్ కారణంగా ఆమె మూవీ నుండి తప్పుకున్నారని, ఆమె రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ లు సొంతం చేసుకోవాలని కోరుతూ ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని త్వరలో అనౌన్స్ చేస్తాం అని తన ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా కొద్దిసేపటి క్రితం హీరో మంచు విష్ణు తెలిపారు. కాగా ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ లో నటించనున్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :