బన్నీకి హీరోయిన్ కుదిరేసింది !
Published on Jul 16, 2017 1:13 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ ను పరిశీలిస్తున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్న నైపథ్యంలో ఇప్పుడు ఆమెనే కథానాయకిగా ఫైనల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘మజ్ను’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం పవన్ – త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. దేశభక్తి నైపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను ఆగష్టు మొదటి వారం నుండి మొదలుపెట్టనున్నారు. 2018 సంక్రాంతికి విడుదలకానున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ చేయనున్నారు

 
Like us on Facebook