“జెంటిల్మాన్ 2” లో హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత.!

Published on Mar 23, 2022 11:00 am IST

ఇండియన్ జేమ్స్ కేమరూన్ అయినటువంటి విజనరీ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అర్జున్ హీరోగా చేసిన సినిమా “జెంటిల్మాన్” కూడా ఒకటి. అయితే ఈ భారీ సినిమాకి గాను ఆ సినిమా నిర్మాత కుంజుమోన్ కొన్నాళ్ల కితం సీక్వెల్ ని అనౌన్స్ చెయ్యడం జరిగింది.

అది కూడా పాన్ ఇండియా లెవెల్లో చెయ్యడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. మరి ఇదిలా ఉండగా గత రెండు రోజులు నుంచి సినీ వర్గాల్లో ఈ సినిమాలో చేసే హీరోయిన్ ఎవరు అనే దానిపై చర్చ స్టార్ట్ కాగా ఈరోజు నిర్మాత కుంజుమోన్ ఒక అధికారిక క్లారిటీని ఇచ్చేసారు.

ఈ చిత్రంలో యంగ్ యాక్ట్రెస్ నయనతార చక్రవర్తి ఫీమేల్ లీడ్ గా కనిపించనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో హీరో ఎవరు దర్శకుడు ఎవరు అనేవాటిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా. దిగ్గజ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ సినిమాని సంగీతం అందివ్వనున్నట్టు ఇది వరకే అనౌన్స్ చేసారు.

సంబంధిత సమాచారం :