కళ్యాణ్ రామ్ కు హీరోయిన్ దొరికేసింది !

31st, May 2017 - 08:47:00 AM


2016 లో చేసిన ‘ఇజం’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా రెండు సినిమాలను ట్రాక్ మీదికి తీసుకొచ్చారు. వాటిలో ఒకటి ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’. శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి వంటి వారి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన ఉపేంద్ర మాదవన్ దర్శకుడిగా పరిచయమవుతూ చేస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మనాలి రాథోడ్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. సీనియర్ దర్శకుడు వంశీ డైరెక్ట్ చేసిన ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన ఈమెకు కళ్యాణ్ రామ్ సినిమాలో పూర్తి స్థాయి కథానాయకి పాత్ర లభించడంతో వెంటనే ఓకే చెప్పేసిందట. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్నిభరత్ చౌదరి, విశ్వ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.