‘పవన్ కళ్యాణ్’ సరసన హీరోయిన్ ఫిక్సయింది

Shruthi-hasan1 (1)
‘సర్దార్ గబ్బర్ సింగ్’ పరాజయం తరువాత ఏమాత్రం ఆలస్యం చేయనకుండా ‘పవన్ కళ్యాణ్’ వెంటనే ఓ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టేశారు. ‘ఎస్. జె సూర్య’ నుండి గోపాల గోపాల ఫెమ్ ‘డాలి’ చేతుల్లోకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ లో నిన్నటి వరకూ హీరోయిన్ కుదరలేదు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా మొదట ‘శృతి హాసన్’ ను అనుకున్నారు. పవన్ కూడా ఆమె పట్ల ఆసక్తి చూపాడు.

కానీ శృతి హాసన్ మాత్రం తన తండ్రితో కలిసి నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ ఇవ్వలేక పవన్ కు నో చెప్పి అందరికీ షాకిచ్చింది. మళ్లీ ఏమైందో ఏమోగాని ఇప్పుడు అదే శృతి హాసన్ డేట్లు అడ్జెస్ట్ చేసుకుని పవన్ సరసన హీరోయిన్ గా ఫిక్సయిందట. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ స్వయంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఆగష్టు నుండి షూటింగ్ జరుపుకోనుంది. గతంలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ లు జంటగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.