లేటెస్ట్ : హాస్పిటల్ లో చేరిన హీరోయిన్ ఇలియానా …. కారణం ఏంటంటే ?

Published on Jan 31, 2023 6:00 pm IST

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన కథానాయికల్లో ఇలియానా కూడా ఒకరు. తొలిసారిగా దేవదాసు మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఫస్ట్ మూవీ తోనే మంచి విజయం అందుకున్నారు. అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి మూవీలో హీరోయిన్ గా నటించి ఆడియన్స్ ని ఆకట్టుకుని వారి మనసులో గొప్ప స్థానం సంపాదించారు. ఇక అక్కడి నుండి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేస్తున్న ఇలియానా ఇటీవల హిందీకే ఎక్కువ పరిమితం అయ్యారు.

అయితే విషయం ఏమిటంటే, తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ తో సినీ, వ్యక్తిగత విషయాలు ఆమె షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల తనకు కొంత అనారోగ్యం కలిగిందని, అందువలన తనకు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారని చేతికి సెలైన్ పెట్టిన ఒక పోస్ట్ ని షేర్ చేసారు ఇలియానా. తనకు పెద్దగా ప్రమాదమేమీ లేదని, త్వరలోనే కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇక అది చూసిన పలువురు అభిమానులు ఆమెకు ఏమైందో అని ఆందోళన చెందినప్పటికీ పెద్దగా ప్రమాదం ఏమి లేదని తెలియడంతో ఆమె త్వరలో కోలుకుని మా అందరి ముందుకు సంతోషంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :