వరుణ్ తేజ్ కోసం లావణ్య త్రిపాఠి ప్రార్థన..!

Published on Apr 8, 2022 1:31 am IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ వార్తలపై అటు వరుణ్‌ కానీ, ఇటు లావణ్య కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈ రూమర్స్‌ మరోసారి తెరపైకి వచ్చాయి.

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన “గని” చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ నేపధ్యంలో గని టీంకు లావణ్య ఆల్‌దిబెస్ట్ చెప్పింది. ‘వరుణ్‌.. ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావు.. నీతో పాటు నీ టీం చేసిన హార్డ్‌ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :