శ్రీవిష్ణు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రాజెక్ట్ లో యంగ్ హీరోయిన్ కి ఆహ్వానం!

Published on Oct 1, 2022 1:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఫైనెస్ట్ నటుడు శ్రీవిష్ణు కూడా ఒకడు. మరి తాను రీసెంట్ గా “అల్లూరి” చిత్రంతో పలకరించగా నెక్స్ట్ అయితే పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో తాను సిద్ధంగా ఉన్నాడు. అలా రీసెంట్ గానే తన కొత్త సినిమా టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఓకే చేసాడు.

అయితే ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించనుండగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాలో తమ హీరోయిన్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ రెబా మోనికా ని తీసుకొని తమ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నామని అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి అయితే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ వర్క్ చేయనుండగా రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :