స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో 5వ సినిమాకు రంగం సిద్ధమైంది. ‘F2’, ‘F3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి చిత్రాల తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండగా, ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక కీలక పాత్రలో నటించబోతుండటం విశేషం.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్గా ‘మహానటి’ ఫేం కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు సమాచారం. ఇక కళ్యాణ్ రామ్ జోడీగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్కు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం వెంకీ నటిస్తున్న సినిమా పూర్తికాగానే, జూన్ నుంచి ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. సంక్రాంతి సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి మార్కు కామెడీకి తోడు, వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
