మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఖరారు !

2nd, January 2018 - 08:30:56 PM

మ‌హేష్ బాబు కధానాయకుడిగా వంశీ పైడిప‌ల్లి తీయబోయే చిత్రానికి కధానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. పూజా హెగ్డే గతంలో డిజే, ముకుంద సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీ వాసు దర్శకత్వంలో నటిస్తోంది.

మహేష్, వంశి పైడిపల్లి సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఫిబ్రవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నాడు. భారీగా తెరకేక్కబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంభందించిన నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.