రామ్ కొత్త సినిమాలో హీరోయిన్ కుదిరింది ?

రామ్ నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఇటివల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో రామ్ నటించబోతున్నాడు. త్రినాద్ రావ్ నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ డైరెక్టర్ ‘నేను లోకల్’ సినిమా తరువాత చెయ్యబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

తాజా సమాచారం మేరకు ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించబోతోందని సమాచారం. రష్మిక ప్రస్తుతం నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ, పరుశురామ్ ల చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే ఈ హీరోయిన్ మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటం విశేషం. రామ్, త్రినాద్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి రెండోవారం నుండి ప్రారంభంకానుంది.