సమంత-చైతూ విడాకులపై హీరోయిన్ మాధవీలత స్పందన..!

Published on Oct 5, 2021 11:27 pm IST


అక్కినేని నాగ చైతన్య-సమంత విడిపోవడంపై సోషల్ మీడియాలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మూడేళ్ళ పాటు ఘాడంగా ప్రేమించుకున్న ఈ జంట తర్వాత పెళ్ళి చేసుకుని నాలుగేళ్ల వైవాహిక జీవితాన్ని కొనసాగించి చివరకి వీరి బంధానికి మొన్న ఎండ్ కార్డ్ వేసుకోవడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజాగా వీరి విడాకులపై స్పందించిన హీరోయిన్ మాధవీలత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమంత హిందూ దేవుళ్లపై తప్పుగా ఏనాడూ మాట్లాడలేదని, సమంత డ్రెస్సింగ్ స్టైల్ కారణంగానే వీరిద్దరు విడిపోయారన్న వాదన సరికాదని అన్నారు. తల్లి కావాలని సమంత కోరుకునేదని, కానీ తల్లి కాకుండా ఆమెను ఆపారని అన్నారు. పెళ్లైనా ఓ రోబోలా ఆమె పనిచేసి డబ్బులు సంపాదించిందని, కోట్లు సంపాదిస్తూ కూడా కుటుంబం నుంచే పాకెట్ మనీ తీసుకోవాల్సి వచ్చేదని అన్నారు. ఈ దారుణాల కంటే సమంత విడిపోవడం మంచేదేనని మాధవీలత చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :