టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కి కరోనా పాజిటివ్..!

Published on Jan 19, 2022 10:35 pm IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకే తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియచేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ కరోనా బారిన పడ్డానని, ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నానని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నానని, ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపింది. అంతేకాదు దయచేసి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప బయటికి రాకండని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రంతో ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్‌కి పరిచయమైంది. ఇటీవల వచ్చిన ‘తిమ్మరుసు’, ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ లాంటి చిత్రాలతో నటించి మెప్పించింది. తాజాగా మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :