ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలో కళ్యాణ్ రామ్ ‘హీరోయిన్’ !

sana121
ఎన్టీఆర్- పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా. కాగా ఈ చిత్రం తమిళ్ రీమేక్ లో ‘అయోగ్య’ టైటిల్ తో విశాల్ మరియు రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా రాబోతున్న విషయం తెలిసందే. ఈ సినిమా ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇప్పటికే ఒక్క ఐటమ్ సాంగ్ తప్ప మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తీ చేసుకుంది ఈ చిత్రం. కాగా తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ ఐటమ్ సాంగ్ లో విశాల్ సరసన సనాఖాన్‌ స్టెప్పులు వెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాంగ్ లో నంటించడానికి సనాఖాన్‌ చిత్రబృందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఇకపోతే సనాఖాన్‌ గతంలో ‘కత్తి’ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఎ.ఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Exit mobile version