సమంత తల్లి పాత్రలో టబు ?

సమంత తల్లి పాత్రలో టబు ?

Published on Dec 19, 2022 7:30 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మరో స్పెషల్ రోల్ ఉందట. సెకండాఫ్ లో వచ్చే ఈ కీలక పాత్రలో బాలీవుడ్ నటి టబు నటించబోతుందట. మరి టబు ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో నటిస్తోందో చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే, టబు సమంత తల్లి పాత్రలో నటిస్తోందట. అయితే, ఈ వార్త పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఒకవేళ ఈ వార్త నిజం అయితే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో బజ్ క్రియేట్ అవుతుంది. గత ఏడాది నుంచి టబు చిత్రాలు హిందీలో వరుసగా సక్సెస్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం కూడా సాగుతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు