ఇటీవల రజినీకాంత్ సరసన ‘కాలా’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి. ప్రస్తుతం ఆమెకు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’ సైరా’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.
ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్యలు కలిసి నటించనున్న మల్టీ స్టారర్ చిత్రంలో ఒక కథనాయిక పాత్రా కోసం హ్యూమా ను సంప్రదించగా ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని సమాచారం . మరి ఈ చిత్ర నిర్మాతలు ఆమె అడిగినంత ఇస్తారో లేక ఆ స్థానంలో మరొక హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటారో చూడాలి.
